ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 7:26 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఈ నెల 21న విజయ్ దేవరకొండ “రణబాలి” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఏందయ్యా సామీ..’ రిలీజ్ అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి”. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “రణబాలి” సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా “రణబాలి” సినిమా రూపొందుతోంది. అక్టోబర్ 16న విజయదశమి పర్వదినం సందర్భంగా “రణబాలి” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ రోజు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఏందయ్యా సామీ..’ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. ఈ నెల 21న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ పాటను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. విజయ్, రశ్మిక పెళ్లి సందర్భంగా రిలీజ్ చేసిన ‘ఏందయ్యా సామీ..’ సాంగ్ ప్రోమో హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడీ ఫుల్ వెర్షన్ సాంగ్ కోసం ఆడియెన్స్ వేచి చూస్తున్నారు. విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న వివాహం తర్వాత కలిసి నటిస్తున్న సినిమాగా అటు వారి ఫ్యాన్స్ లోనూ, ఇటు మూవీ లవర్స్ లోనూ “రణబాలి” సినిమా ఆసక్తి కలిగిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ చిత్ర టీజర్ మూవీపై అంచనాలు మరింతగా పెంచేసింది.
నటీనటులు – విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న, ఆర్నాల్డ్ వోస్లూ, తదితరులు
=============================